2025లో విండోస్‌ 10ఒఎస్‌ నిలిపివేత

Dec 22,2023 21:05 #Business

వాషింగ్టన్‌ : మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఒఎస్‌) సర్వీసు మద్దతును నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2025 అక్టోబర్‌ 14 నుంచి ఈ ఒఎస్‌ను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది. దీనివల్ల విండోస్‌ 10తో పనిచేస్తున్న కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ రావని కెనాలసిస్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. దీంతో యూజర్లు తప్పక కొత్త కంప్యూటర్లు లేదా కొత్త ఒఎస్‌ను కొనుగోలు చేయాల్సిన రావొచ్చు. దాదాపు 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం పడనుందని అంచనా. కాగా.. పాత కంప్యూటర్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం వల్ల సుమారు 480 మిలియన్‌ కిలోల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగవుతాయని కెనాలసిస్‌ అంచనా వేసింది.

➡️