గతేడాది 8 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలు

Dec 30,2023 21:05 #Business

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 కోట్ల పైగా ఐటి రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. 2023-24 మదింపు సంవత్సరంలో శుక్రవారం నాటికి ఈ రికార్డు చోటు చేసుకుందని ఐటి శాఖ వర్గాలు వెల్లడించాయి. 2022-23 మదింపు సంవత్సరంలో మొత్తం 7,51,60,817 రిటర్నులు దాఖలయ్యాయి. దీంతో పోల్చితే ఈ ఏడాది నూతన మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఐటిఆర్‌ ఫైల్‌ చేసిన వారు ఏమైనా తప్పులుంటే 2023 డిసెంబర్‌ 31 నాటికి గడువు ఉంది.

➡️