బైజూస్‌ కార్యాలయాల మూత..!

Mar 11,2024 20:50 #Business, #Byjus, #closed, #ofice
  • 25 శాతం మందికే వేతనాలు

బెంగళూరు : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ దేశ వ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేస్తుందని సమాచారం. బెంగళూరులోని హెడ్‌ ఆఫీసు మినహా 300 బైజూస్‌ ట్యూషన్‌ సెంటర్లను నిలిపివేస్తోందని మనీకంట్రోల్‌ రిపోర్ట్‌ చేసింది. ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. మరోవైపు తన ఉద్యోగుల్లో 25 శాతం మందికే ఫిబ్రవరి నెల పూర్తి వేతనాలు అందించిందని సమాచారం. అందులోనూ తక్కువ వేతనం ఉన్నవారే. మిగతా వారికి పాక్షిక చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. కొందరు పెట్టుబడిదార్లు నిధులను బ్లాక్‌ చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వేతనాలు చెల్లిస్తున్నామని బైజూస్‌ యాజమాన్యం ఇటీవల ఉద్యోగులకు లేఖలు పంపిన విషయం తెలిసిందే.

➡️