ఫ్లాష్‌తో 30 నిమిషాల్లో డెలివరీ : షాడోఫాక్స్‌

Dec 21,2023 21:23 #Business

న్యూఢిల్లీ : లాజిస్టిక్స్‌ సంస్థ షాడోఫ్యాక్స్‌ కొత్తగా 30 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేయడానికి ఫ్లాష్‌ బై షాడోఫాక్స్‌ను పరిచయం చేసినట్లు తెలిపింది. ఇది వ్యాపారులు, వినియోగదారులు తక్షణ డెలివరీ సేవలను పొందడానికి అనుమతిస్తుందని పేర్కొంది. తక్కువ ఖర్చుతో కూడిన చివరి మైల్‌ డెలివరీ పరిష్కారాలను అందించడం ద్వారా డుంజో ను ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని షాడోఫ్యాక్స్‌ కో ఫౌండర్‌ ప్రహర్ష్‌ చంద్ర పేర్కొన్నారు.

➡️