శ్రీరామ్‌ ఫార్మ్‌ నుంచి ఐదు పంట సంరక్షణ ఉత్పత్తులు

Jun 28,2024 21:10 #Business

హైదరాబాద్‌ : ఐదు రకాల నూతన తరం పంట సంరక్షణ, స్పెషాలిటీ ప్లాంట్‌ న్యూట్రిషన్‌ ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు శ్రీరామ్‌ ఫార్మ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లో వీటిని ఛానెల్‌ భాగస్వాముల సమక్షంలో విడుదల చేసినట్లు ఆసంస్థ పేర్కొంది. కలుపు నిర్వహణ పరిష్కారానికి శ్రీరామ్‌ బికుటాను పరిచయం చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా తన క్రిమిసంహారక పోర్ట్‌ఫోలియోలో శ్రీరామ్‌ సైషో, శ్రీరామ్‌ క్రోన్‌, శ్రీరామ్‌ ట్రెక్చ్సరల్‌, స్పెషాలిటీ ప్లాంట్‌ న్యూట్రిషన్‌ అయినా శ్రీరామ్‌ ప్రోటోబజ్‌ంను పరిచయం చేసినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజరు చబ్రా తెలిపారు.

➡️