గోల్డ్‌ ఫైనాన్స్‌ తీసుకుంటే చేతికి రూ.20 వేలే!

May 10,2024 21:20 #Business

న్యూఢిల్లీ : నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) నగదు పంపిణీని రూ.20 వేలకు పరిమితం చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. బంగారం రుణం కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్‌బిఎఫ్‌సిలు నగదు రూపంలో గరిష్టంగా రూ.20 వేలే ఇవ్వాలని, మిగతా మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లలో జమచేయాలని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రచారం కోసం నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో బంగారం భారీగా తాకట్టుపెట్టే ప్రక్రియకు అడ్డుకట్ట వేసేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు.

➡️