లూబ్రికెంట్‌ స్క్రూ కంప్రెసర్‌ ఆవిష్కరణ

May 23,2024 21:27 #Business

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: ఈఎల్‌జీఐ నుండి పర్మనెంట్‌ ఆయిల్‌ లూబ్రికేటెడ్‌ స్క్రూ కంప్రెసర్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ మహేశ్వర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఎయిర్‌ కంప్రెసర్‌ తయారీ దారులలో ఒకటైన ఈ ఎల్‌ జీ ఐ ఎక్విప్‌మెంట్‌ సంస్థ తమ ఈజీ సిరీస్‌ శ్రేణికి అప్‌ గ్రేడ్‌ చేస్తూ ఆయిల్‌ లూబ్రి కెంట్‌ స్క్రూ ఎయిర్‌ కంప్రెసర్‌ పరిచయం చేసినట్లు తెలిపారు.అత్యాధునిక ఇజిపిఎం 15 శాతం వరకు మెరుగైన సామర్ధ్య లాభాలను అందిస్తుందని తెలిపారు. ప్రతి కస్టమర్లకు 16 శాతం ఉచిత ఎయిర్‌ డెలివరీ అందిస్తుంది అని తెలిపారు.

➡️