కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్‌ పరీక్ష పత్రాలు లీకేజీ

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ద్వారానే నీట్‌ పరీక్ష పత్రాలు లీకేజీ అయిం దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగా యని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటానికే నిర్ణయించుకుందని తెలిపారు. కొన్ని రోజు లుగా నీట్‌ స్కాంపై అభ్యర్ధులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్ర యించినా పట్టించుకోని ప్రభుత్వం, చివరికి సుప్రీం కోర్టు కేంద్రానికి, నీట్‌ను నిర్వ హించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)లకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారు. ఎన్‌టిఎను మెరుగు పర్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంతేతప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తా మనికాని, అభ్యర్ధులకు ఏవిధమైన న్యాయం చేస్తామనికాని తెలపలేదని పేర్కొ న్నారు. నీట్‌లో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పు లన్నట్లు పేర్కొన్నారు. తప్ప పశ్చాత్తాపం వ్యక్తీకరించలేదని తెలిపారు. మంత్రి నుంచి ఇన్నాళ్లకు వెలువడిన పేలవమైన స్పందన బట్టి నీట్‌ స్కాంను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు తయారుగా ఉందని అర్థమవుతుందన్నారు. నీట్‌లో అవకతవకలే జరగలేదని కేంద్రం చెబుతూ వచ్చిందని బిజెపి ఏలుబడిలోని గుజరాత్‌లో అవకతకలు జరిగాయని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో ఒక్కసారిగా అక్రమాల పుట్ట పగిలినట్లయిందని తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్‌లో శివ్‌రాజ్‌సింగ్‌ ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాల్లో జరిగిన వ్యాపం కుంభకోణం గుర్తుకొస్తోందని తెలిపారు. కోర్టుల్లో విచారణ సందర్భంగా వెల్లడవుతున్న నీట్‌ అక్రమాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయని తెలిపారు. 67 మంది అభ్యర్ధులకు 720 మార్కులు రావడం, వారిలో హర్యా నాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన అరుగురు ఉండడం, ఒఎంఆర్‌ షీట్లలో ఒక విధంగా స్కోరింగ్‌ కార్డుల్లో మరొక విధంగా మార్కులొచి అనూ హ్యమైన రీతిలో కటాఫ్‌ మార్కులు, సగటు మార్కులు పెరిగాయని నిష్పక్ష పాతంగా సమగ్ర దర్యాప్తు జరిపిస్తే మరెన్నో అక్రమాలు వెలుగు చూడొచ్చునని పేర్కొన్నారు. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉండాలంటూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ను 2019లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను ప్రవేశపెట్టి భిన్నత్వం ఏకత్వం కలిగిన భారతదేశంలో నీట్‌ సరైనది కాదని పలు రాష్ట్రాలు అభ్యంతరం పెట్టాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి, అభ్యర్ధులకు, పేదలకు, గ్రామీణ విద్యార్థులకు నష్టమన్న ఆందోళనలు బలంగా వ్యక్తమయ్యాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సర్వోన్నత న్యాయ స్థానానికి నిజం చెప్పి సమగ్ర దర్యాప్తునకు ముందుకు రావడం బాధ్యత అనిపించుకుటుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానుజలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మదన్‌ మోహన్‌రెడ్డి, గణేష్‌, సమీర్‌, మౌలా, విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌: నీట్‌ పరీక్షపై జరుగుతున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎన్‌టిఎను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్య కేంద్రీకరణలో భాగంగా నీట్‌ పరీక్షను తీసుకువచ్చి విద్య ప్రయివేటీకరణ చేస్తుం దని విమర్శించారు. దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాలని విద్యార్థులపై ఒత్తిడిని పెంచిందని, రాష్ట్రాల హక్కులను కలరాయడమే అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యుగంధర్‌, సురేష్‌, శంకర, రామ్‌ పాల్గొన్నారు.

➡️