ఎంజి మోటార్‌కు ఎన్‌ఇసిఎ అవార్డ్‌

Dec 16,2023 21:30 #Business

న్యూఢిల్లీ : ఎంజి మోటార్‌ ఇండియాకు నేషనల్‌ ఎనర్జీ కన్సర్వేషన్‌ అవార్డ్‌ (ఎన్‌ఇసిఎ) 2023 లభించింది. వాహన పరిశ్రమలో ఇంధన సామర్థ్యం వినిమయంలో మెరుగైన ప్రగతిని కనబర్చినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అవార్డును పొందినట్లు తెలిపింది. విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ అవార్డును ఎంజి మోటార్‌ ఇండియా తరుపున ఆ సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బిజూ బాలేంద్రన్‌కు ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ అందజేశారు. తమ ఉత్పత్తులపై కార్బన్‌డైఆక్సైడ్‌ ఉద్గారాలను 36 శాతం మేర తగ్గించేలా తమ బ్రాండ్‌ కృషి చేసిందని ఆ సంస్థ పేర్కొంది.

➡️