ఎయిరిండియాలోకి కొత్త ఎయిర్‌బస్‌ ఎ350-900

Jan 23,2024 08:10 #air india, #Business

న్యూఢిల్లీ : ఎయిరిండియా కొత్తగా కొనుగోలు చేసిన ఎయిర్‌బస్‌ ఎ350-900 వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ విమానాన్ని దేశంలోనే తొలిసారి ఎయిరిండియా ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్‌ ఇండియా -2024లోనూ ప్రదర్శించింది. దీంతో సోమవారం బెంగళూరు, ముంబయిల మధ్య సేవలను ప్రారంభించింది. ఎఐ589 ప్లయిట్‌ నెంబర్‌తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.05 గంటలకు ప్రారంభమై.. 8.50 గంటలకు ముంబయికి చేరుకుంది. తదుపరి దశల్లో చెన్నరు, ముంబయి, హైదరాబాద్‌ సేవలకు ఉపయోగించనుంది. డిజిసిఎ అనుమతుల తర్వాత తదుపరి అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించనుంది. ఇందులో 28 ప్రయివేటు బిజినెస్‌ సూట్‌లు సహా మొత్తం 350 సీట్లు ఉన్నాయి. ఈ విమానంతో 20 శాతం ఇంధనం ఆదా కానుందని ఇటీవల ఎయిర్‌బస్‌ వెల్లడించింది.

➡️