మహీంద్రా ట్రాక్టర్స్‌ నుంచి కొత్త ఓజా3140

హైదరాబాద్‌ : మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్‌ కొత్తగా ఓజా 3140 మోడల్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వరి పంటలకు సంబంధించిన తడి పనుల్లోనూ అసాధారణమైన ఫలితాలు చూపించనుందని ఆ సంస్థ తెలిపింది. 30-40 హెచ్‌పి సామర్థ్యంతో అసమానమైన పనితీరు, ఇంధన ఆదాను కలిగిన ఈ ట్రాక్టర్‌ తేలికగా ఉండటంతో పాటు అధునాతన పనితీరు కనపరుస్తుందని పేర్కొంది.

➡️