పోకో నుంచి ఎం6 5జి ఫోన్‌ ఆవిష్కరణ

Dec 22,2023 21:23 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో శుక్రవారం మార్కెట్లోకి ఎం6 5జి ఫోన్‌ను విడుదల చేసింది. మూడు స్టోరేజీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ బేసిక్‌ మోడల్‌ 4జిబి ర్యామ్‌, 128 జిబి ఇంటర్నల్‌ స్టోరేజీ ధరను రూ.10,499గా ప్రకటించింది. రెండు రంగుల్లో దీన్ని విడుదల చేసింది. వెనుకవైపు 50 మెగా పిక్సెల్‌ ఎఐ కెమెరా, సెల్ఫీ కోసం 5ఎంపి కెమెరాను అమర్చింది. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది.

➡️