టాటా నెక్సాన్‌ 7 లక్షల యూనిట్ల విక్రయం

Jun 15,2024 21:15 #Business

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ కంపాక్ట్‌ ఎస్‌యువి నెక్సాన్‌ అమ్మకాల్లో మరో మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ ఏడు లక్షల యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టాటా మోటార్స్‌ డీలర్లు, షోరూమ్‌ల వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నెక్సాన్‌ కార్లను బుక్‌ చేసుకుని డెలివరీ కోసం వేచి చూస్తున్న వారికి రూ.లక్ష వరకూ బెనిఫిట్లు కల్పిస్తున్నట్లు తెలిపింది. 2017 సెప్టెంబర్‌ 21న తొలిసారి టాటా నెక్సాన్‌ కారును అందుబాటులోకి తెచ్చింది.

➡️