బైజూస్‌ రుణ నిబంధనల ఉల్లంఘన

Apr 5,2024 21:20 #Business, #Byjus

న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.350 కోట్లు (42 మిలియన్‌ డాలర్లు) విలువైన రుణ నిబంధనలను ఉల్లంఘించింది. తాజా వివాదంలో భారతీయ బిలియనీర్‌ డాక్టర్‌ రంజన్‌ పారు నేతృత్వంలోని ఎంఇఎంజి ఫ్యామిలీ ఆఫీస్‌కు బైజుస్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఆకాష్‌ ముందుగా అంగీకరించిన బదిలీ ద్వారా 42 మిలియన్ల రుణాలను తిరిగి చెల్లించలేదనే ఆరోపించింది. దీనిపై బైజుపై మధ్యవర్తిత్వ ప్రక్రియను మార్చిలో ప్రారంభించిందని సమాచారం. ఇప్పటికే అనేక సంస్థలకు సంబంధించిన రుణ చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బైజూస్‌పై తాజా పరిమాణం మరింత ఒత్తిడిని పెంచనుంది.

➡️