అంగన్వాడీల అక్రమ అరెస్టు తగదు

Jan 20,2024 00:31

పిడుగురాళ్లలో సమ్మె శిబిరంలో మాట్లాడుతున్న ఏపూరి గోపాలరావు

పిడుగురాళ్ల : అంగన్వాడీలు సమస్యలు తమ పరి ష్కరించాలని కోరుతూ శుక్రవారం 39వ రోజు రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా విజయవాడ వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ తీవ్రంగా ఖండిం చింది. ఉదయం 6 గంటలకు వారిని అరె స్టు చేసి మధ్యాహ్నం12 గంటల తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాల రావు హాజరై మాట్లాడుతూ పోలీస్‌ అరెస్ట్‌ లతో, నిర్బంధాలతో ఉద్యమాలను ఆప లేరని, అక్రమ అరెస్టులు సమస్యకు పరి ష్కారం కాదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిడుగురాళ్లలో అధి కారులు, పోలీసులు నిర్బంధకాండ కొన సాగిస్తున్నా రని విమర్శించారు. ఇది ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాను కూలంగా స్పందించి అంగ న్వాడీల న్యాj ుమైన డిమాండ్లను పరిష్క రించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు . సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లా డుతూ మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు అర్ధ రాత్రి వారి ఇళ్లపై దాడులు నిర్వహించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అరెస్టయిన వారి లో సిఐటియు మండల కార్యదర్శి తెలక పల్లి శ్రీనివాసరావు అంగన్వాడీ యూని యన్‌ నాయకులు డి.శాంతమని, శివరం జని, బాజిబి, పద్మ, రమాదేవి, ధనలక్ష్మి , కుమారి, అరుణ, జయ కుమారి, విజయ రాణి, శివపార్వతి,మాధవి పాల్గొన్నారు.

అమరావతి: అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ పోరాటం వృథా కాదని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు అన్నారు.39వ రోజు అంగన్వాడి సమ్మె కొనసాగింది. చట్టపరమైన సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. చట్టపకారంగా సమాధాన పత్రాలు ఇచ్చినా కూడా సూపర్వైజర్లు అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ పైన స్థానిక గ్రామల వైసిపి నాయకులతో ఫోన్లు చేయించి బెదిరింపు చర్యలకు పాల్పడు తూ కుటుంబాల్లో గొడవలు సృష్టించటం సబబు కాదని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ శాంతియుతంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే బెది రింపులకు పాల్పడట మంచి పద్ధతి కాద న్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్య లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

వినుకొండ: వినుకొండలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలో జరిగే నిరవధిక నిరాహార దీక్షకు వినుకొండ నుండి అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్య కర్తలు, ఆయాలు తరలి వెళ్లారు. కొందరు అంగన్వాడి మహిళలు సమ్మె శిబిరానికి చేరుకొని సిఐటియు పట్టణ కార్యదర్శి అంగలకుదురు ఆంజనేయులు ఆధ్వ ర్యంలో 39వ రోజు సమ్మెను కొన సాగించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️