అంగన్వాడీల గోడు పట్టదా?

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్రాలకు తాళాలు పగులగొట్టించడం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటోంది. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి-పీలేరు ప్రభుత్వానికి అంగన్వాడీల గోడు పట్టడం లేదని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె ఆగదని, ప్రభుత్వం వారిని భయపెట్టి సాధించేది ఏమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ రాజేశ్వరి తెలిపారు. సిఐ టియు, ఎఐటియుసి సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాలుగవ రోజు చేరుకుంది. పీలేరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ముందు వారు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ బాధ్యులు బెజవాడ దినేష్‌, ఇతర నాయకులు పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దనాసి వెంకట్రామయ్య, సిఐటియు నాయకులు పరంజ్యోతి, కృష్ణమ్మ, రెడ్డెప్ప, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సాంబశివ, సిపిఐ జిల్లా నాయకులు టిఎల్‌ వెంకటేష్‌, నరసింహులు, అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : హక్కుల సాధన కోసం అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గం బాధ్యులు పూల భాస్కర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్‌, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యదర్శి శ్రీహరి, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చంద్రా రెడ్డి, సుబ్బారెడ్డి, రాజు తదితరులు నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, కార్యకర్తలు ఈశ్వరమ్మ, అమరావతి, శివరంజని, శివ జ్యోత్స్న, విజయమ్మ పాల్గొన్నారు. నిమ్మనపల్లి: అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిమ్మనపల్లి మండలం అంగనవాడీ కార్యకర్తలు, సహాయకులు డిమాండ్‌ చేశారు. ఎంపిడిఒ కార్యాలయం ఎదుట నల్ల దుస్తులను ధరించి తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవే ర్చాలని ధర్నా చేశారు. అనంతరం స్థానిక ఎంపిడిఒ శేషగిరిరావుకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యాకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. బి.కొత్తకోట : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి మండల ప్రజా పరిషత్తు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మండల ఎఒ థామస్‌కు వినతి పత్రం అందజేసి అక్కడి నుంచి తహ శీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌ రఫీ అహ్మద్‌కు వినతి పత్రం అందజేసి తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ములకలచెరువు ,బి.కొత్తకోట, పిటిఎం మండలాల కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు వేణుగోపాల్‌ రెడ్డి, సలీం, రఘునాథ్‌ మద్దతు తెలిపారు. ఓబులవారిపల్లి : రైల్వేకోడూరు ప్రాజెక్టు దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరామయ్య, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి పెంచలయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు జాను ప్రసాద్‌, సిఐటియు మండలం కార్యదర్శి కె.వి.రమణ, మహిళా సంఘం నాయకులు మెహెతాజ్‌, సునీత, మంజుల మద్దతు తెలిపారు. మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీ సెంటర్‌ల తాళాలను పగుల గొట్టడాన్ని నిరసిస్తూ ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, చిత్తూరు బస్టాండ్‌లోని వాల్మీకి సర్కిల్‌ నుంచి ర్యాలీగా వెళ్లి ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపకులు పులి శ్రీని వాసులు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయ కులు మధురవాణి, గంగాగీత, కార్యకర్తలు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: అంగన్వాడీలు కరుణశ్రీ, గౌరీ, స్వరూప రాణి, సులోచనలు ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల వరకు ర్యాలీగా వెళ్లారు. తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపిడిఒ సురేంద్రనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచిన సిడిపిఒరాజంపేట అర్బన్‌ : సిడిపిఒ సుజామణి పట్టణంలోని కొలిమి వీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని బలవంతంగా తెరిపించారు. ప్రభుత్వ బెదిరింపులు, తాటాకు చప్పులకు భయపడేది లేదని, అధికారులు బెదిరింపు ధోరణి మానుకోవాలని అంగన్వాడీలు హెచ్చరించారు. తంబళ్లపల్లి: తంబళ్లపల్లె ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఎంపిడిఒ సురేంద్రనాథ్‌, సిడిపిఒ నాగవేణి, ఐసిడిఎస్‌ సూపర్వైజర్ల, గ్రామ సచివాలయ ఉద్యోగులచేంద్రాలను పునఃప్రారం భించారు. రామాపురం: మండలంలో 13 గ్రామపంచాయతీ పరిధిలోని 65 అంగన్వాడి కేంద్రాలు ఉండగా 28 కేంద్రాలను గ్రామాల సచివాలయ ఉద్యోగులు. అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మజ, సుజాతమ్మ, హుస్సేనమ్మ తాళాలు పగలగొట్టి ప్రారంభించారు. కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు అంగన్వాడి సూపర్వైజర్లు డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు. పెద్దమండ్యం: అంగన్వాడీల సమ్మె కొనసాగించారు. బస్టాండ్‌ సర్కిల్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయం మహిళా పోలీసు సుప్రజ సమక్షంలో సిబ్బంది తాళాలు తీశారు. కేంద్రంలోనికి వెళ్లి అక్కడ ఉన్న స్టాకును స్వాధీనం చేసుకున్నారు.అంగన్వాడీ కేంద్రాలకు రక్షణ కల్పించాలి అంగన్వాడీ కేంద్రాలకు అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికు మార్‌, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సిఐ ముత్తయ్య ఆచారికి ఫిర్యాదు చేశారు. మెప్మా, సచివాలయ సిబ్బంది మూసివున్న అంగన్వాడీ కేంద్రాలను తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారని తెలిపారు. కేంద్రా లలో ఉన్న రికార్డులు, గర్భిణి, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారాల భద్రతకు ముప్పు ఉందన్నారు. తమ ఫిర్యాదును స్వీకరించి అంగన్వాడీ కేంద్రాలకు భద్రత కల్పించాలని కోరారు. కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులురైల్వేకోడూరు : పట్టణంలోని ధర్మపురం అంగన్వాడీ కేంద్రాన్ని సిడిపిఒ టిపి సౌభాగ్యమ్మ, ఎంపిడిఒ జాషువా సమక్షంలో సిబ్బంది తాళాలు పగలగొట్టారు. అంగన్వాడీ కేంద్రంలోనికి వెళ్లి అక్కడ ఉన్న స్టాకును కోడూరు-2 సచివాలయానికి చెందిన కార్యదర్శికి స్వాధీనం చేసి బాధ్యతలు అప్పగించారు. ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నల్ల దుస్తులు ధరించి ప్లకార్డులతో సమ్మె, నిరసన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు రమాదేవి, గౌరవ అధ్యక్షులు మంజుల, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాదా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మ, వెన్నెల, శిరీష, లీలావతి, ఈశ్వరమ్మ, మైతిలి, సునీత, నిర్మల, వాణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జాన్‌ ప్రసాద్‌, ఓబులవారిపల్లె సిపిఎం నాయకులు జయరాం పాల్గొన్నారు. సుండుపల్లె : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టేందుకు వచ్చిన విఆర్‌ఒ, సచివాలయ ఉద్యోగులు, పంచా యతీ కార్యదర్శి, ఎఎన్‌ఎం, మహిళా పోలీసు, ఇతర అధికారులను కార్యకర్తలు, సహాయకులు అడ్డుకున్నారు. మాకు రావాల్సిన టిఎ, డిఎ, జీతాలు చెల్లించి తాళాలు తీయండంఃటూ అధికారులను అడ్డుకున్నారు. హామీలు మరిచిన సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీలకు అండగా ఉంటాం : టిడిపిరాయచోటి: అంగన్వాడీలకు అండగా ఉంటామని టిడిపి నాయకులు మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలకు, ఆయాలకు వెయ్యి మందికి ఆన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వయంగా అందరికీ ఆయనే వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు ఎడాపెడా హామీలిచ్చి, నేడు అధికారకాలం ముగుస్తున్నా నేటికీ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు రమణా రెడ్డి, నాగార్జున రెడ్డి, షాహుల్‌, ఉమేష్‌, షరీఫ్‌, మహ బూబ్‌ బాష, అంజినేయులు రెడ్డి, శేఖర్‌ రెడ్డి, పలువురు అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు. పుల్లంపేట: అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రైల్వేకోడూరు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి గోసాల దేవి అన్నారు. ప్రభుత్వంలోకి రాగానే వేతనాలు పెంచు తామని మాయ మాటలు చెప్పిన జగన్‌ ఇప్పుడు మాట తప్పారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ శాంతయ్య, పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్‌, రైల్వే కోడూరు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నన్నం శివకృష్ణ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం వర్తింప చేయకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌ రెడ్డి, టిడిపి నాయకులు అజంతుల్లా, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

➡️