అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి- కంభం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్‌ అన్వర్‌బాషా మాట్లాడుతూ అంగన్‌వాడీలు సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. జీవో నంబరును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు షేక్‌ ఇబ్రహీం, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు. సిఎస్‌ పురంరూరల్‌ : అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గుర్రం లక్ష్మయ్య తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్నపురెడ్డి తిరుపతిరెడ్డి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. మార్కాపురం రూరల్‌ : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మె చేపట్టి 30 రోజులు పూర్తయిన సందర్భంగా 30 ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. సిపిఎం నాయకులు దగ్గుపాటి సోమయ్య, గుమ్మా బాలనాగయ్య, సిపిఐ నాయకులు అందె నాసరయ్య, షేక్‌ ఖాసిం, సిఐటియు నాయకులు పి.రూబెన్‌ అంగన్‌వాడీలకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో పాల్గొంటున్న అంగన్‌వాడీలకు నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కనిగిరి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి.కేశవరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనఆనరు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుజాత, సీత, రజిని, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌందర్య, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకుడు నరేంద్ర, ఐద్వా నాయకులు బషీరా, శాంత కుమారి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 30వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జె. జయంతిబాబు, కౌలు రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి టి.శ్రీకాంత్‌, సిఐటియు నాయకులు జి.బసవపున్నయ్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు వెంకటసుబ్బమ్మ ,దుర్గాభవాని, అరుణ, రజనీ,కల్యాణి, రమ తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు : అంగన్‌వాడీల ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సమంజసం కాదని సిఐటియులు నాయకులు విమర్శించారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టంగుటూరి రాము, వేశపోగు మోజెస్‌ మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు శేషమ్మ, హేమలత, వెంకటరత్నం, సుశీల, శ్రీదేవి, వై.విజయ, షేక్‌ ఆషా పాల్గొన్నారు. పెద్ద దోర్నాల : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం నాయకులు డి.సోమయ్య కోరారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, కాశీశ్వరి పాల్గొన్నారు. యర్రగొండపాలెం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మె చేపట్టి 30 రోజులు పూర్తయిన సందర్భంగా తహశీల్దారు కార్యాలయం వద్ద 30వ నంబరు ఆకారంతో కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం.రఫీ, ఏరియా కో ఆర్డినేటర్‌ షేక్‌ అమీర్‌బాషా, అంగన్‌వాడీ నాయకులు మల్లేశ్వరి, సుభాషిణి, నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజ కుమారి, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు : అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకా సుబ్బారావు, ఆదిలక్ష్మి, జయప్రద, రజిని, నిషా, అనురాధ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కొండపి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కెజి. మస్తాన్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు జి.వందనం, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. వెలిగండ్ల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పెళ్లి జంటలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రాయల మాలకొండయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ముక్కు మహాలక్ష్మమ్మ, సోము వెంకట శ్రీలక్ష్మి, పద్మావతి, వెంకటలక్ష్మి, సలోమి, గుజ్జుల నాగేంద్రమ్మ, సీతారాములు, జ్యోతి, భాగ్యలక్ష్మి, రమాదేవి, పెద్దక్క, రఫియా పాల్గొన్నారు.

➡️