అంగన్‌వాడీల నిరసన హోరు

ప్రజాశక్తి – పొదిలి : అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు ఎం.రమేష్‌ కోరారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మర్రిపూడిలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల వర్కర్స్‌ సమస్యలను పరిష్కరించేందుఉ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కిసాన్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయపరమైన కోరికలను పరిష్క రించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కొండపి : ప్రభుత్వం అంగనాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెలకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కెజి. మస్తాన్‌, సిఐటియు నాయకులు జి.వందనం, రైతు నాయకుడు ముప్పరాజు చినబ్రహ్మయ్య, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు 13వరోజూ సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, మేరికుమారి, కాశీశ్వరి పాల్గొన్నారు. కంభం : సమ్మెలో భాగంగా స్థానిక కందులాపురం సెంటర్‌లో కంభం ,అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలకు చెందిన అంగన్‌వాడీలు రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెలకు సిఐటియు, ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ అన్వర్‌ బాషా, నాయకులు దానం, వెంకట్‌, ఎఐటియుసి నాయకులు షేక్‌ ఇబ్రహీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాల నాగయ్య, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కనిగిరి : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసికేశవరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల నిరంకుశ వైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా కేంద్రాలను ఇతరులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రజిని, శారద, సుశీల, రాధ, బీబీ జాన్‌, అంకమ్మ , రామ సుబ్బులు, సిఐటియు నాయకులు నరేంద్ర, మాలాద్రి,చెన్నకేశవులు ,నాగరాజు పాల్గొన్నారు. దర్శి : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే వెంటనే పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం దర్శి డివిజన్‌ కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తాండవ రంగారావు, మోహన్‌రావు, యూనియన్‌ నాయకులు అచ్చమాంబ, పాతిమా, రంగమ్మ, నాగజ్యోతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి మల్లేశ్వరి డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మల్లేశ్వరి, పి సుభాషిని, ఎ నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజుకుమారి, సుబ్బులు పాల్గొన్నారు. సిఎస్‌.పురం : అంగన్‌వాడీల సమస్యలలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు ప్రకటించాయి సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి మారంరెడ్డి రత్నారెడ్డి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. సిఎస్‌ పురంరూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ మండల నాయకుడు ఇర్ల కొండయ్య డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెలకు యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఊసా వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ నాయకులు రఫియా, వెంకట లక్ష్మమ్మ, నారాయణమ్మ, అనురాధ, మాధవి తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌ : అంగన్‌వాడీల సమ్మెకు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️