అంగన్‌వాడీల బిక్షాటన

Dec 16,2023 21:17

ప్రజాశక్తి-బాడంగి  :  సమ్మెలో భాగంగా బాడంగి మండల కేంద్రంలో అంగన్వాడీలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. వీరికి సిఐటియు నాయకులు సురేష్‌, ఎపి రైతు సంఘం నాయకులు గోపాల్‌ మద్దతిచ్చారు.

నెల్లిమర్ల : అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టిన వారిపై కేసు నమోదు చేయాలని అంగన్వాడీలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఎంపిడిఒకు వినతి అందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రమాదేవి, బంగారు లక్ష్మి, ఆదిలక్ష్మి, భారతి, తదితరులు పాల్గొన్నారు.

వంగర : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నాచేశారు. తహశీల్దార్‌ డి ఐజాక్‌కు వినతి అందించారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పి.భారతి, ఎస్‌. కుమారి, మంగమ్మ, జయమ్మ పాల్గొన్నారు.

చీపురుపల్లి : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దారు ఎం.సురేష్‌కి అంగన్వాడీలు ఫిర్యాదు చేశారు. సమ్మెకు టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు మద్దతు తెలిపారు

బొబ్బిలి, రూరల్‌ : అంగన్వాడీల పోరాటానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, జనసేన నాయకులు బి.దివ్య, లంక రమేష్‌, బెల్లాన శ్రీను సందర్శించి మద్దతు ప్రకటించారు. పట్టణంలోని ఎన్‌టిఆర్‌ కూడలి నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ చేపట్టారు. అనంతరం టిడి అప్పయ్యకు వినతి అందించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్‌వాడి యూనియన్‌ నాయకులు జె.కామేశ్వరి, జి.జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు.

గరివిడి : అంగన్వాడీలు సమ్మెలో భాగంగా ఎంపిడిఒ, తహశీల్దార్‌కు వినతులు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి పిఎస్‌వికె వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

భోగాపురం : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు శనివారం నల్ల రిబ్బన్లు కట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. అంగన్వాడీల వద్దకు జనసేన పార్టీ నాయకులు లోకం మాధవి వచ్చి మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, యూనియన్‌ నాయకులు కృష్ణవేణి, జనసేన నాయకులు పల్లంట్ల జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️