అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలి

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు లలిత

ప్రజాశక్తి-కూనవరం

అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సిఐటియు నాయకులు లలిత డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు 33 రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఈ ప్రాంతంలో తమ ఓట్లతో గెలిచిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం తమ ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేయడం పేర్కొన్నారు. కనీసం ఆందోళనకు సంఘీభావం పలకరింపు, భరోసా ఇవ్వటానికి సైతం చేయడం లేదని, పూర్తిగా ముఖం చాటేయడం సరికాదని పేర్కొన్నారు. సమస్యలు విని ప్రభుత్వానికి చేరవేయటానికి ప్రజాప్రతినిధులే వారదులని, ఆ పని చేయకుండా తప్పించుకొని తిరగటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంజమ్మ, అన్నపూర్ణ, ప్రసన్న కుమారి, శ్రీదేవి, కుమారి, గౌరి, సిఐటియు మండల అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️