అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

Dec 2,2023 21:10
మాట్లాడుతున్న రెహనాబేగం

మాట్లాడుతున్న రెహనాబేగం
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
ప్రజాశక్తి-ఉలవపాడు
అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనాలను తెలంగాణ కన్నా అదనంగా పెంచాలని కోరుతూ ఈనెల 8 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఎస్‌కె రెహనా బేగం పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని సచివాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఎపి అంగన్‌వాడీ ఉలవపాడుప్రాజెక్టు సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.రెహనాబేగం పాల్గొని మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్న మాట నీటి మూటగా మిగిలిందన్నారు. 2002లో సుప్రీంకోర్టులో అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు మన రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. సమస్యల సాధన కై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్ల న్నీ మూతవేసి డిసెంబర్‌ 8నుండి నిరవధిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శిజి.వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు కమిటీ గౌరవాధ్యక్షులు జీవీబీకుమార్‌ లు మాట్లాడుతూ ఉలవపాడు ప్రాజెక్టు ఆఫీస్‌ వద్ద డిసెంబర్‌ 8 నుండి సమ్మె శిబిరాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలు సి.హెచ్‌.ఇందిరావతి అధ్యక్షత వహించినది.సమావేశంలో ఉలవపాడు మండల సిఐటియు కార్యదర్శి ఎస్‌.డి.గౌస్‌ భాషా తోపాటు అంగన్వాడీ లు కత్తి. బుజ్జమ్మ, మార్తమ్మ, కుమారి, శారదా, సుజాత,గీత,ప్రవీణ,తిరుపతమ్మ ,కోటేశ్వరి ఉన్నారు.

➡️