అంగన్‌వాడీల సమ్మెకు ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డి సంఘీభావం

Dec 21,2023 19:04
సంఘీభావం తెలుపుతున్న దృశ్యం

సంఘీభావం తెలుపుతున్న దృశ్యం
అంగన్‌వాడీల సమ్మెకు ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డి సంఘీభావం
ప్రజాశక్తి -నెల్లూరు అర్బన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. గురువారం నగరంలోని ఐసిడిఎస్‌ కార్యాలయంలో వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీల శిబిరం వద్దకు రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరుకుని సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలతోపాటు కాసేపు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అంగన్‌వాడీల జీతాలను రూ చంద్రబాబు రూ.4200 నుంచి 10,500 లకు పెంచితే ప్రస్తుత సిఎం జగన్మోహన్‌రెడ్డి కేవలం రూ. 1,000 మాత్రమే పెంచారన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సాక్షి పత్రిక, టీవీ చానల్స్‌లో రూ. కోట్లలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇస్తున్నారని, ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్‌వాడీల ఇబ్బం దులను తీర్చేందుకు ఒక బటన్‌ నొక్కితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అతి త్వరలో టిడిపి -జనసేన మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల సమస్యలను చేర్చి పరిష్కరిస్తామన్నారు. టిడిపి – జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

➡️