అంగన్వాడీల సమ్మెకు త్వరలో పరిష్కారం

Dec 31,2023 21:12

ప్రజాశక్తి – సాలూరు : అంగన్వాడీ చేపట్టిన సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన అంగన్వాడీల నిరసన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలపై సిఎం మంచి అభిప్రాయంతోనే వున్నారని చెప్పారు. జీతాల పెంపుపై అధ్యయనం చేయడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారని తెలిపారు. ఈ కమిటీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అంగన్వాడీలకు గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రతిపక్ష నాయకులను అడగాలని సూచించారు. సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను నడిపించడం సరైన పద్దతి కాదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బి.రాధ చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆట పాటలతో వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, అంగన్వాడీ ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, ఎ.అంజలి, ఎస్‌.ప్రియ, గౌతమి, అరుణకుమారి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మె 20వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం మండల కేంద్రంలో అంగన్వాడీలు ఆట, పాటలు నిర్వహించి తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.జ్యోతి, శ్రామిక మహిళా నాయకులు బి.లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిచో జనవరి 3న పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ గౌరమ్మ, ఎం.సావిత్రి, జి.హైమావతి, టి.లక్ష్మి, అచ్చియ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీల సమ్మెలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో ఆటపాటలతో నిరసన తెలిపారు. సిఐటియు ఐక్యత, అంగన్వాడీలు అందిస్తున్న సేవలను పాట రూపంలో వినిపిస్తూ నృత్యాలు చేస్తూ తమ భావాన్ని బాధను ప్రభుత్వానికి వినిపించారు. కార్యక్రమంలో అంగన్వాడీల అధ్యక్ష, కార్యదర్శులు సత్యవతి, కస్తూరి ఉన్నారు.పాలకొండ : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పాలకొండ ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆటపాట, ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, అంత వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. అలాగే ప్రజల మద్దతుతో ఆందోళనలు తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి, ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు జి.జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్‌.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి, సుగుణ, లలిత, నిర్మల తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, యూనియన్‌ నాయకులు యశోద, సునీత, ఎస్‌.అరుణ, పి.పద్మ, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ. ఆర్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారుకొమరాడ : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె ఆదివారం 20వ రోజు కొనసాగింది. సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు వాలీబాల్‌, కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అనురాధ, పద్మ, మల్లేశ్వరమ్మ, జ్యోతి, జయమ్మ, లలిత, సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, పలువురు కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.బలిజిపేట : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. బలిజిపేటలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసిపి అంగన్వాడీ ఉద్యోగులకు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు. వైసిపి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టడమే తప్ప వారికి న్యాయం చేసిన దాఖలాల్లేవన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పెంకి వేణు వేణుగోపాల నాయుడు, సీనియర్‌ బి.సీతారాం, ఎస్‌.రాంబాబు, జి.బాబ్జీ, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.అంగన్వాడీల జీవితాలతో చెలగాటం తగదుపార్వతీపురంరూరల్‌ : చిన్నారులకు ఆటపాటలను నేర్పే అంగన్వాడీ కార్యకర్తల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీ మణి అన్నారు. కనీస వేతనాలు కల్పించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 20వ రోజు ఆదివారం, జీవితాలతో చెలగాటమాడవద్దని వినూత్న రీతిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆటపాటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. సెక్టార్‌ లీడర్స్‌ కె.రాజేశ్వరి, ఎం.గౌరీ, బి.సునీత, విమల, కృష్ణవేణి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️