అందరికీ సామాజిక సేవాభావం ఉండాలి

Jan 7,2024 20:58

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ప్రజలందరికి సేవాబావం ఉండాలని బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహరావు, మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు అన్నారు. ఆదివారం స్ధానిక సాయికృష్ణ దియేటర్‌ వద్ద మదురా పౌండేషన్‌ రెల్లివలస వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మోగా వైద్యశిభిరాన్ని వారు ప్రారంబించారు. ఈ వైద్య శిభిరంలో సుమారుగా 1000 మంది రోగులుకు తనికీలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. కాస్వీ హస్పటల్‌ ఎమ్‌డి, ఆర్థోపెడిక్‌ వైద్యులు మోపాడ ప్రవీణ్‌కుమార్‌, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ మహంతి శ్రీనువాసరావుతో పాటు పిడియాట్రిక్స్‌, న్యూరాలజీ, కార్డియాలజి తదితర వైద్యులు హజరై రోగులును పరీక్షించారు. ఈ సందర్బంగా పౌండేషన్‌ ఆర్గనైజర్‌ మహంతి అరుణకుమారి మాట్లాడుతూ సేవాబావంతోనే ఈ పౌండేషన్‌ ప్రారంబించా మన్నారు. పౌండేషన్‌ స్ధాపకలు మహంతి శ్వేతసాయికుమారి గ్రామీణ ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో స్థాపించారన్నారు. అనంతరం వైద్య శిబిరానికి హాజరైన 700 మంది రోగులకు దుప్పట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మాజీ ఎంపిపిలు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్‌, టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు, నాయకులు ఆకిరి ప్రసాదరావు, పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి సన్యాసినాయుడు, బ్రాహ్మణ సాధికారి సమితి జిల్లా అధ్యక్షలు ఐ. రాకేష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

➡️