అంబేద్కర్‌ ఆశయ సాధనకు అలుపెరుగని పోరాటం

ప్రజాశక్తి – రాయచోటి విశ్వ విజ్ఞాని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం పోరాటం చేయడం గొప్ప విషయమని ఆ సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకల్లో వివిధ సంఘాల నేతలు అభివర్ణించారు. రాయచోటి పట్టణంలో బాస్‌ 11వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం, గురువారం రెండు రోజుల పాటు నిర్వహించారు. వేడుకలల్లో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి శివాలయం సర్కిల్‌ వరకూ అంబేడ్కర్‌ చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో జైభీమ్‌ మహాసభ నిర్వహించారు. బాస్‌ రాష్ట్ర కార్యదర్శి పల్లం తాతయ్య అధ్యక్షత వహించారు. ఈ మహాసభకు బాస్‌ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్‌ తోపాటు వీసీకే పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్‌ఛార్జి బాలసింగం, ఆంధ్రప్రదేశ్‌ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్‌ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. రెండ్రోజుల పాటు నిర్వహించిన వివిధ జిల్లాలకు చెందిన బాస్‌ నాయకులు ముత్యాల మోహన్‌, పాలకుంట శ్రీనివాసులు, బాలకష్ణ, వినోద్‌, సచిన్‌, అడ్వకేట్‌ మహేష్‌, లతోపాటు స్థానిక నాయకులు రామకష్ణ పాల్గొన్నారు.

➡️