అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి

Jan 17,2024 19:56
మాట్లాడుతున్న వైసిపి నాయకులు అంబేద్కర్‌

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-కందుకూరు విజయవాడలో ఈనెల 19న సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా జరిగే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కందుకూరు పట్టణ వైసిపి అధ్యక్షులు ఎస్‌కె రఫీ, జె సి ఎస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైసిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎంఎల్‌శ్రీ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం నుంచి 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక న్యాయ సంకల్ప సభకు వచ్చే వారు తమ పరిధిలోని సచివాలయాల్లో ఈ రోజు నుంచి 18 వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించార. 19 వ తేదీన ఉదయం 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. ఉలవపాడు మండల అధ్యక్షులు నన్నం పోతురాజు, జేసిఎస్‌ కోఆర్డినేటర్‌ ధనకోటి, వలేటివారిపాలెం మండల జేసిఎస్‌ కోఆర్డినేటర్‌ అనుమోలు వెంకటేశ్వర్లు, గుడ్లూరు జెడ్‌పిటిసి కె బాపిరెడ్డి , నాయకులు నగళ్ల నారయ్య, బికారి పాల్గొన్నారు.

➡️