అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు : ‘సిటు’

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అన్నారు. ఆశావర్కర్లు ఈ నెల 8వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యాక్రమానికి వెళుతున్న తనతోపాటు సిఐటియు ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, మాధవయ్య, ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మెహరున్నీసాను అరెస్టు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తమ హక్కులను పరిష్కరించాలని ఆశా వర్కర్లు శాంతి యుతంగా ధర్నా కోసం వెళ్తుండగా జిల్లాలోని గాలివీడు, గుర్రంకొండ, మదనపల్లె, నందలూరు ఎక్కడికక్కడ బస్టాండ్‌ రైల్వేస్టేషన్‌ల దగ్గర ఇండ్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. జీతాలు పెంచకుండా రెగ్యులర్‌ చేయకుండా పనిభారం పెంచి తీవ్ర మానసిక వేతనాలకు గురి చేస్తున్న ప్రభుత్వానికి రానున్న కాలంలో బుద్దీ చెబుతామని హెచ్చరించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.

➡️