అక్రమ అరెస్టులు అన్యాయం

ప్రజాశక్తి- కడప అర్బన్‌ మెగా డిఎస్‌సి విడుదల చేయమంటే అక్రమ అరెస్టులు చేయిం చడ తగదని డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు పేర్కొన్నారు. ప్రభుత్వం మెగా డిఎస్సీ విడుదల చేయాలని విజయవాడ లోని విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన అందజేస్తున్న నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయ డాన్ని నిరసరిస్తూ బుధవారం పూలే సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏటా డిఎస్‌సి విడుదల చేసా ్తమని హామీ ఇచ్చి గడిచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలలు గడు స్తున్నా ఒక్క డిఎస్‌సి కూడా విడుదల చేయకపోవడం దారుణం అన్నా రు. రానున్నది ఎన్నికల కాలమని, నిరుద్యోగులు తగిన రీతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర ఉపాధ్య క్షులు విజరు పవన్‌ నాయకులు ఉదరు గిరి బాషా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : అక్రమ అరెస్టు చేయ డాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్‌రాజ్‌ తెలిపారు. విజయ వాడలో డివైఎఫ్‌ఐ నాయకులు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రొద్దు టూరు పట్ట ణంలో ఉన్న గాంధీరోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేప ట్టారు. కార్యక్రమంలో రవి, బాలు, శీను, మహేష్‌బాబు పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్టు చేయడం తగదని డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి నంద్యాల తులసీశ్వర్‌ యాదవ్‌ అన్నారు. నిరసన కార్యక్రమంలో పట్టణ నాయకులు రాఘవ, మహేష్‌, సూరి, నవీన్‌ పాల్గొన్నారు. కడప అర్బన్‌ : ప్రభుత్వం మెగా డిఎస్‌సిను విడుదల చేయాలని కోరుతూ విజయవాడలోని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పోలీసులు చేత అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఏటా డిఎస్‌సి విడుదల చేస్తామని హామీ ఇచ్చి గడిచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. బద్వేలు : ప్రభుత్వం మెగా డిఎస్‌సిని విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీలు మేరకు డివైఎఫ్‌ఐ నాయకులు విజయవాడలోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమంలో పోలీసులు చేత అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండి స్తున్నామని డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్‌ షరీఫ్‌ గంగనపల్లి నాగార్జునలు తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో పట్టణ నాయకులతో కలిసి వారు సమావేశాన్ని నిర్వహిం చారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ మహిళా కన్వీనర్‌ సి.గురుదేవి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సహాయ కార్యదర్శి సురేష్‌, కెవిపిఎస్‌ నాయకులు రాయప్ప, ఐద్వా మహిళా సంఘం పట్టణ కార్యదర్శి రత్తమ్మ పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని జమ్మలమడుగు జనసేన పార్టీ నియో జకవర్గ ఇన్‌ఛార్జి, కార్యదర్శి అల్లం సూర్య నారాయణ, నల్లంశెట్టి నాగా ర్జున సంయుక్తంగా తెలిపారు. వారు విలేకరులతో మాట్లా డుతూ జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేం ద్రను కారణం చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్యక్రమంలో జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్‌ పవన్‌కుమార్‌, జనసైనికులు టి.హరినాధ్‌రెడ్డి, ఆవుల వినరుకుమార్‌, షేక్‌ మహబూబ్‌ బాషా, అల్ల బకాష్‌, షాకీర్‌ బాషా పాల్గొన్నారు. మైదుకూరు : రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకుడు బొజ్జ దశరధరామిరెడ్డి అరెస్టు అక్రమమని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఎవి రమణ అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు కోసం 2016 మే 21న కర్నూలు జిల్లా సిద్దేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని పోరాటం చేసినందుకు దశరథరామిరెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేయడం బాధా కరమన్నారు. కార్యక్రమంలో రైతు సేవా సమితి నియోజకవర్గ అధ్యక్షులు రామాంజనేయులు, ఖాజీపేట మండల నాయకులు లక్ష్మయ్య, పట్టణ రైతు నాయకులు రామ్మోహన్‌, శ్రీనివాసులు, జేమ్స్‌, నాగరాజు పాల్గొన్నారు.

➡️