అగర్వాల్‌ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రం ప్రారంభం

Dec 19,2023 21:31
రాయచోటిలో కేంద్రాన్ని ప్రారంభిస్తూ...

అగర్వాల్‌ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రం ప్రారంభంతిరుపతి సిటీ : దేశంలో అతి పెద్ద కంటి సంరక్షణ కేంద్రాల్లోఒకటైన డాక్టర్‌ అగర్వాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఐ హాస్పిటల్స్‌ తమ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రాన్ని రాయచోటి లో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి శ్రీకాంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా అగర్వాల్స్‌ ఐ క్లినిక్‌ ఒక ఆధునిక కంటి సంరక్షణ సదుపాయం అన్నారు. ఇందులో నిపుణులైన వైద్యులు సంపూర్ణ కంటి ఆరోగ్య చెక్‌-అప్స్‌ అందిస్తారు. ఈ కేంద్రములో రిఫ్రాక్షన్‌ డిగ్రీ, కంటి ఒత్తిడి, విజువల్‌ తీక్షణతలను ఖచ్ఛితంగా అంచనా వేసేందుకు, కంటి శుక్లాలను ప్రారంభదశలోనే కనుగొనుటకు అత్యాధునిక ఉపకరణాలు ఉన్నాయన్నారు. డాక్టర్స్‌ అగర్వాల్స్‌ ఐ క్లినిక్‌ లో ”ఏదైనా లెన్స్‌ కొనండి ఒక ఫ్రేమ్‌ ఉచితంగా పొందండి” అనే ప్రారంభ ఆఫర్‌ తోపాటు ఉచిత శుక్లాల చెక్‌-అప్స్‌ కూడా అందిస్తోందన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోసుమంత్‌ రెడ్డి, డాక్టర్‌ గోపికష్ణ పాల్గొన్నారు. రాయచోటిలో కేంద్రాన్ని ప్రారంభిస్తూ…

➡️