అగ్ని ప్రమాద బాధితులకు సాయం

సాయం అందజేస్తున్న హసన్‌ బాద సర్పంచ్‌ సతీష్‌ రావు

ప్రజాశక్తి-రామచంద్రపురం

మండలంలోని హసన్‌ బాద గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో కడియాల వీరవేంకట లక్ష్మికి చెందిన తాటాకు ఇల్లు కాలిపోయింది. ఇంటితో పాటు సామగ్రి కూడా కాలిపోవడంతో సుమారు రూ.1 లక్ష ఆర్థికంగా నష్టం వాటిల్లిందని గ్రామ సర్పంచ్‌ నాగిరెడ్డి సతీష్‌ రావు తెలిపారు. గ్రామ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, వాలంటీర్లు, రెవెన్యూ, సిబ్బంది, వార్డు సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 

 

➡️