అడ్డంకులను అధిగమించి అంగన్వాడీ ఆందోళనలు

 వినుకొండ:  సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని, అంగన్వాడీల న్యాయమైన సమ స్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియుసి, ఎఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేప ట్టిన సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందించే కార్యక్రమానికి పిలుపులో భాగంగా ఏఐటియుసి జిల్లా కోశాధికారి ప్రసన్న కుమారి అధ్యక్షతన అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు పట్ట ణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవ హరిస్తున్న వ్యతిరేక విధానాన్ని ఎండ గడుతూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక కొత్తపేటలోని లాయర్‌ స్ప్రేట్‌ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్ద కు చేరుకున్నారు. వినుకొండ సిఐ ఎస్‌ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసు బల గాలు ఎమ్మెల్యే ఇంటి వద్ద మొహరించారు. ఎమ్మెల్యే ఇంటి ముఖద్వారం వద్ద పోలీ సులు బారీకేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీ లను అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠా యించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పిఎ కి వినతిపత్రం ఇచ్చి వెళ్లాలంటూ పోలీ సులు తెలపడంతో అందుకు అంగన్వాడీలు నిరాకరించారు. ‘ఎమ్మెల్యే రావాలి’ అంటూ నినాదాలు చేశారు. పోలీ సులు, సిఐ టియు, ఎఐటియుసి, అంగ న్వాడి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చర్చ అనంతరం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వినతి పత్రాన్ని అం దించేందుకు పోలీసులు అనుమతిం చారు. నాయకులతో పాటు అంగన్వాడి క్లస్టర్లు సభ్యులు కలిసి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళుతుండగా అంతలో అక స్మాత్తుగా ఆయనే అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే, అనుచరుల దురుసు ప్రవర్తన సిఐటియు, ఎఐటియుసి, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సమక్షంలో అంగన్వాడి యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎఎల్‌ ప్రసన్నకుమారి అంగన్వాడీల సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవిస్తూ పక్కనే ఉన్న సిఐ టియు నాయకులు కె.హనుమంత్‌ రెడ్డిని వివరించాలని ఆమె కోరారు. ‘మీరే ఎమ్మె ల్యేకి చెప్పండి’ అని మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వారి పట్ల దురుసుగా వ్యవహరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌ రెడ్డి పై ఆగ్రహిస్తూ అసభ్యంగా దూషించారు. ఇదే మిటని ప్రశ్నిస్తున్న హనుమంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే, అతని అనుచరులు దాడి చేయ బోయారు. పోలీసులు అత్యుత్సాహం ప్రద ర్శించి అంగన్వాడీలను, హను మంత్‌ రెడ్డిని కింద పడే విధంగా నెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు దూషిస్తూ దాడి చేయబోగా అంగన్వాడీలు, హనుమంత్‌ రెడ్డిని చుట్టుముట్టి అడ్డుకున్నారు. అడ్డు వచ్చిన అంగన్వాడీ కార్యకర్త ఎలిజిబెత్‌ను గొంతు పట్టుకుని, అడ్డు వచ్చిన మరో అంగన్వాడి హెల్పర్‌ కరి మున్నిపై దాడి చేయడంతో చేతికి బలమైన గాయమైంది. అంగన్వాడీలన ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు దుర్భా షలాడారు. ఎమ్మెల్యే దాడి దుర్మార్గం అంగన్వాడీలపై, హెల్పర్లు, సిఐటియు నాయకులపై దాడి ఘటనను ఎఎల్‌ ప్రసన్నకుమారి, ఎఐటి యుసి నాయకులు సారమ్మ ఖండించారు. పోలీసులు అత్యు త్సాహం ప్రద ర్శించి అంగన్వాడీల పట్ల దురుసుగా వ్యవ హరించారన్నారు. అంగ న్వాడీల ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చ రించారు.విన్నవిస్తే దాడి చేస్తారా ? అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడటాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. హనుమంత్‌ రెడ్డి, బొంకూరి వెంకటేశ్వర్లు ఎఐటియుసి నాయకులు మారుతి వరప్రసాద్‌, బూదాల శ్రీను ఖం డించారు.

ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ప్రజాశక్తి-పల్నాడు

జిల్లా సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డిని దూషించడం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తగదని దీనిపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సిఐటియు నాయ కులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్య దర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పల్నాడు విజ్ఞాన కేం దంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ కార్మిక సంఘాల నాయ కులపై దౌర్జన్యాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిం చారు. సమావేశంలో శ్రామిక మహిళ సమ న్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివ కుమారి, సిఐటియు నరసరావుపేట మం డల అధ్యక్షులు షేక్‌. సిలార్‌ మసూద్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి-సత్తెనపల్లి టౌన్‌

స్థానిక మంత్రి అంబటి రాంబాబును కలసి తమ గోడును తెలిపేందుకు స్థానిక తాలూకా నుండి మంత్రి కార్యాలయం వద్దకు బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకుంటారనే విషయాన్ని ముందుగానే గమనించిన నిరసనకారులు, ర్యాలీని మరోమార్గం వైపు మళ్లించారు. ఇది గమ నించిన పోలీసులు కేరళ హౌటల్‌ వద్ద బారికేడ్లను అడ్డుగాపెట్టారు. అనుమతి ఇవ్వమని పోలీసులు, వెళ్ళాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టడంతో తోపు లాట జరిగింది. ఈ ఘటనలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ జిల్లా అధ్య క్షులు గుం టూరు మల్లేశ్వరి మల్లేశ్వ రితో పాటు పలువురు అంగన్వాడీ మహి ళలు కింద పడ్డారు. మంత్రికి వినతిపత్రం ఇవ్వకుండా తాము వెనుకకు వెళ్లేది లేదని అంగన్వాడీ మహిళలు పోలీ సులతో వాగ్వావాదానికి దిగారు. సంఘీ భావం తెలిపేందుకు అక్క డకు వచ్చిన సిఐటియు మండలం కార్య దర్శి పెం డ్యాల మహేష్‌ , డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు రాజ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. ర్యాలీగా కాకుండా ముఖ్య మైన నాయ కులను కొందరిని మాత్రమే అనుమతిస్త్తా మని రూరల్‌ సిఐ తెలపగా దానికి మహి ళలు అంగీకరించలేదు. అక్కడే బైఠా యించారు. పల్నాడు జిల్లా సిపిఎం నాయ కులు ఘటన స్టలికి చేరు కుని సంఘీ భావం తెలిపారు. ర్యాలీతో మంత్రి కార్యా లయం వరకు వెళ్తామని, అంగన్‌వాడీ ముఖ్యనేతలే మం త్రి పిఎను కలసి వినతిపత్రం ఇస్తారని పోలీసులకు నాయ కులు చెప్పారు. అనంతరం ర్యాలీ మంత్రి కార్యాలయం వరకు రాగానే అంగ న్వాడీ ముఖ్యనేతలు మంత్రి పిఎను కలసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగ న్వాడీ సెక్టార్‌ నాయకులు అహల్య , విమల, ధనలక్ష్మి , వీరమ్మ, సుజాత, అం జలి, జ్యోతి, చాముం డేశ్వరి, వెంకటలక్ష్మి ఐద్వా నాయకులు డిఐ విమల పాల్గొన్నారు.

ప్రజాశక్తి-అమరావతి

స్థానిక శ్రీ అమరేశ్వర దేవస్థానం నుండి అంగ న్వాడీలు నిరసన ర్యాలీ నిర్వ హించారు. సత్తెనపల్లి రోడ్డు క్రాస్‌ రోడ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మండల సిఐటియు మం డల కార్యదర్శి బి.సూరిబాబు, అంగ న్వాడీలు, సిఐటియు నాయకులు కార్యక ర్తలు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-చిలకలూరిపేట

పట్టణంలోని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌( సిఐటియు) యూని యన్‌ ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యా లయం నుంచి మంత్రి విడుదల రజిని కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వ హించారు. మంత్రి అందుబాటులో లేని కారణంగా ఆఫీస్‌ బ్యారర్‌ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఎఐవైఎఫ్‌ పల్నాడు జిల్లా కన్వీనర్‌ షేక్‌.శుభాని,జిల్లా కాంగ్రెస్‌ సేవా దళ్‌ అధ్యక్షులు జాష్టి నాగ రామాం జనేయులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. సిఐటియు మండల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు అంగ న్వాడీల యూనియన్‌ అధ్యక్షురాలు జి. సావిత్రి, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ అధ్య క్షులు ఎస్‌.లూథర్‌,ఎం.విల్సన్‌ పాల్గొ న్నారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల

స్థానిక బంగ్లా సెంటర్‌ నుంచి బ్యాంక్‌ సెంటర్‌ మీదుగా ఎమ్మెల్యే ఆఫీస్‌ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు హాజరై స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్‌ ముందు కూర్చొని అంగ న్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి. శ్రీనివాసరావు, బి.వెంకటేశ్వర్లు, సంపత్‌ వెంకట కృష్ణ,షేక్‌ బాబు, రైతు సంఘం నాయ కులు బి.నాగేశ్వరరావు అంగన్వాడి నాయకులు డి.శాంతమణి, షేక్‌ హజర, శివరంజని, వెంకటరమణ, వెంకట రమ ణ, కవిత, దేవకుమారి,మల్లేశ్వరి, సుమతి, ప్రమీల, జ్యోతి, భవాని పాల్గొన్నారు.

ప్రజాశక్తి-క్రోసూరు

యూనియన్‌ ఆధ్వర్యంలో క్రోసూరు లోని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆఫీసు ప్రతినిధి తేల్లూరి అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు జి.రవిబాబు, యూనియన్‌ నాయకులు జయలక్ష్మి, శోభ. మెరీనా అను రాధ, విజయనిర్మల,మల్లేశ్వరి, మాధవి భాయి, రెహానా, మంగమ్మ, నాగ రత్నం, నిర్మల పాల్గొన్నారు.

ప్రజాశక్తి-మాచర్ల్ల

స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో ని శిబిరాన్ని సంఘ నాయకురాలు ఉషా రాణి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అం గన్‌ వాడీ యూని యన్‌ నాయకులు ఇందిరా, కాకర్ల పద్మా వతి, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిల కమ్మ, మల్లేశ్వరి,యుటిఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు జెవికెఎస్‌ ప్రసాద్‌, ఎ.నాసర ్‌రెడ్డి, నజీర్‌, యువి రావు, బాలాజీనాయక్‌, పి. రామారావు పాల్గొన్నారు.

➡️