అథ్లెటిక్స్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

Dec 14,2023 23:02
జిపి.రాజు, శ్యామ్‌ తదితరులు

ప్రజాశక్తి – గండేపల్లి

కాకినాడ జెఎన్‌టియుకె పరిధి లోని అంతర్‌ కళాశాల మెన్‌ అండ్‌ వుమెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపి యన్‌ షిప్‌-2023 పోటీలకు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ ప్రాంగ ణంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిత్య క్యాంపస్‌ డైరెక్టర్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో అథ్లెటిక్స్‌ విభాగంలో వివిధ పోటీలు పాల్గొనేందుకు 350 మంది పురుష, 150 మంది మహిళా క్రీడాకారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. 21 మంది ఆదిత్య ఫిజికల్‌ డైరెక్టర్ల పర్యవేక్షణలో పోటీలు పూర్తి నిష్పక్షపాతంగా, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించనున్నట్లు చెప్పారు ఇప్పటికే 41 కళాశాలలకు చెందిన 362 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సతీష్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీలో జెఎన్‌టియుకె పరిశీలకులు డాక్టర్‌ జిపి.రాజు, శ్యామ్‌ తదితరులు పర్యవేక్షణలో జరుగుతాయని కార్యనిర్వాహక కార్యదర్శి జివి.ప్రతాప్‌ రెడ్డి తెలిపారు.

➡️