అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభం

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిపి భవాని తదితరులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

పట్టణంలోని ఎస్‌కెపిజిఎన్‌ క్రీడాప్రాంగణంలో నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఆదివారం ప్రారం భమయ్యాయి. చీఫ్‌ కోచ్‌ ప్రసాద్‌ రెడ్డి సెక్రటరీ రవితేజ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. 200 మంది క్రీడాకారులు పాల్గొనగా 13 మంది ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్య అతిథులుగా డాక్టర్‌ స్టాలిన్‌, గన్నమనేని చక్రవర్తి, ఛైర్మెన్‌ గాదంశెట్టి శ్రీదేవి, ఎంపిపి మండల అంబటి భవాని తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️