అదుపుతప్పి ఆటోబోల్తా అంగన్‌వాడీలకు గాయాలు

Dec 20,2023 23:07 #కంకణంపాడు

ప్రజాశక్తి-వెలిగండ్ల: రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని కంకణంపాడు సమీపంలో రోడ్డు మలుపు వద్ద బుధవారం చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ అంగన్‌వాడీలు వెలిగండ్లలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో పాల్గొనేందుకు హనుమంతునిపాడు మండలం దాసర్లపల్లి అంగన్‌వాడీ కార్యకర్త వరలక్ష్మి, మరి కొంత మంది అంగన్‌వాడీలు ఆటో వస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో వరలక్ష్మి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని కనిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

➡️