అదే జోరు.. ఆందోళనల హోరు..

అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. రోజుకో విన్నూత రీతిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వినూత్నంగా నిరసన తెలిజేశారు. ఆయా కార్యాలయాల ఎదుట బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి-కడప అర్బన్‌ కడప రూరల్‌ ఐసిడిఎస్‌ ఆఫీసు ఎదుట అంగన్వాడీలు బుధవారం 9వ రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా బిక్షాటన చేపట్టారు. బిక్షాటనతో అయినా ప్రభుత్వానికి కనివిప్పు కలగాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ కన్నా అదనంగా రూ.వెయ్యి జీతం పెంచుతానని ప్రకటించారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరం గడిచిన ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌.నాగలక్ష్మి, బి.సంటేమ్మ ఎ.స్వర్ణలత, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వేంపల్లె : జగనన్న మా సమస్యలు అలకించూ అంటూ అంగన్వాడీలు విన్నూతంగా సాష్టాంగ నమస్కారం చేసి సమ్మె చేశారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కారించాలని సిఐటియు, ఎఐటియుసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేంపల్లెలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టే అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. రోడ్డుపై పడుకొని జగనన్న అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సాష్టాంగ నమస్కారం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి నాయకులు లలితా సరస్వతి, శైలజ, వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాలలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మైదుకూరు: సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పట్టణంలో బిక్షాటన చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుంచి పట్టణంలో ర్యాలీగా వెళ్లి బిక్షాటన నిర్వహించారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రభుత్వం జీతాలు పెంచలేదని, భిక్షం వేయాలని అంగన్వాడీలు బిక్షాటన చేశారు. అంగన్వాడీలను రోడ్డుమీదికి రప్పించిన జగన్మోహన్‌రెడ్డి అధికారం కోల్పోయి రోడ్డున పడక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జి.శివకుమార్‌ అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, షరీఫ్‌, జహంగీర్‌బాష, రాహుల్‌, భారతి, ధనలక్ష్మి, చెన్నమ్మ, శోభ, రజియా వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి, రమాదేవి, శివలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, జ్యోతి, అనూష పాల్గొన్నారు. ముద్దనూరు : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు గుడారం తొలగించి తలపై చీర కొంగుతో కప్పుకుని ఎండలోనే సమ్మె నిర్వహించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతు కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నామని దీక్షా శిబిరానికి ఏర్పాటు చేసిన గుడారం అద్దె అదనపు భారం కావడంతో గుడారం తొలగించినట్లు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. దువ్వూరు : ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయం, గంగమ్మ దేవాలయం నుండి పుల్లారెడ్డిపేట వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించారు. ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలు తన బిడ్డను చంకలో వేసుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు(పుట్టపర్తిసర్కిల్‌) :తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మెకు మద్దతుగా టిడిపి ఇన్‌ఛార్జి సతీమణి మౌనిక మద్దతుగా నిలిచారు. తహశీల్దార్‌ కార్యాలయం నుంచి టిబి రోడ్డు మీదుగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అక్కడ నుంచి హోమస్‌పేట, సుధా టాకీస్‌, రాజీవ్‌ సర్కిల్‌ మీదుగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, విజరు కుమార్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, టిడిపి నాయకులు హరిత, తాటి శ్రీనివాస్‌ యాదవ్‌, విశ్వనాధరెడ్డి, ఎఐటియుసి నాయకులు విజయమ్మ, భవన కార్మిక సంఘ నాయకులు ఏసేపు, నాయకులు మంజుల, ముంతాజ్‌ బేగం, వెంకటసుబ్బమ్మ, రాములమ్మ, లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, నాగలక్ష్మి, రాజి, నిర్మల, సునీత, పద్మ పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి ప్రధాన రహదారుల్లో అంగన్వాడీలు ప్రభుత్వానికి వేతిరేకంగా నినాదాలు చేస్తూ బిక్షాటన చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్‌ కుమార్‌, బిసి చైతన్య రాష్ట్ర సమితి రమణ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, నాయకులు రాజశేఖర్‌, రయప్ప, నరసింహులు, ఆంజనేయులు, కె.సుభాషిని, ఆర్‌.హుసేనమ్మ, సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి, కృష్ణవేణి, ప్రవీణ, ఉమాదేవి, మహాలక్ష్మి, రాధమ్మ, అరుణమ్మ పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : అంగన్వాడీల సమ్మెకు సిపిఐ మద్దతు తెలిపింది. కార్యక్రమంలో సిపిఐ పులివెందుల ఏరియా సమితి కార్యదర్శి వెంకట్రాములు, అంగన్వాడీలు సలీమా, స్వప్న, శ్రీలత, ఉష, స్రవంతి, సుధా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు :చంటి పిల్లలకు ఒక తల్లిలా చెల్లిలా డాక్టర్‌లా నర్సులా సేవలందిస్తున్న ఆంగన్వాడీల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి నజీర్‌ అన్నారు. అంగన్వాడీలతో కలిసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జీలానిబాష, సోషల్‌ మీడియా చైర్మన్‌ జానకిరాం జిల్లా ఉపాధ్యక్షుడు అల్లాబక్ష్‌, సమీర్‌ఖాన్‌ సైమన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌, జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ మద్దతు తెలిపారు. అంగన్వాడీలు మేరీ, వినోదా, దస్తగిరిమ్మ, రేణుక, విజయమ్మ, జ్యోతిమ్మ, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి పాల్గొన్నారు

➡️