అద్దె భవనంలోకి కోర్టు సముదాయాలు- అదనపు జిల్లా జడ్జి కృష్ణన్

Jan 27,2024 20:54 #కృష్ణన్

కుట్టిప్రజాశక్తి- రాయచోటి 40 ఏళ్ల కిందట నిర్మించిన రాయచోటి కోర్టు భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని రాయచోటి కోర్టు సముదాయాలను ఒక అద్దె భవనంలోనికి శనివారం మార్చారు. రాయచోటిలో ప్రస్తుతం ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టు అడిషనల్‌ జుడిషియల్‌ మేజి స్టేట్‌, ఫస్ట్‌ క్లాస్‌ జుడిషియల్‌ మే స్టేట్‌ పనిచేస్తున్నాయి. అడిషనల్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యూడిషియల్‌ మేజిస్టేట్‌ కోర్టు 2026 లో నిర్మించిన నూతన భవనాల్లో కొనసాగుతోంది. మిగిలిన కోర్టులన్నీ కూడా 1984లో నిర్మించిన భవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాలకు 15 ఏళ్ల కిందట మరమ్మతులు చేశారు. గత రెండు మూడు సంవత్సరాలుగా భవనాల మోల్డింగ్‌ పెచ్చులు ఊడి కిందట పడుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాత కోర్టు భవనాల స్థానంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని రోడ్లు భవనాలు శాఖ వారి సూచనల మేరకు రాయచోటి ఐదవ అదనపు జిల్లా జడ్జి కష్ణన్‌ కుట్టి రాష్ట్ర హైకోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీంతో పాత కోర్టు భువనాలలో నిర్వహిస్తున్న రాయచోటి ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ కోర్టులను పాత భవనాల నుంచి ప్రయివేట్‌ భవనాలలోనికి మార్చాలని హైకోర్టు నుంచి ఇటీవలనే ఆదేశాలు రావడంతో, రాయచోటి పట్టణం లక్ష్మీపురంలో ఖాళీగా ఉన్న ఒక ప్రయివేట్‌ పాఠశాల భవనాలను అద్దెకు తీసుకుని శనివారం మూడు కోర్టులను అక్కడికి తరలించారు. లోకదాలత్‌ కోర్టు కూడా పనులు ప్రారంభించింది. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో మూడు కోట్లు కూడా అక్కడే పని చేస్తాయని రాయచోటి ఐదవ జిల్లా జడ్జి కష్ణన్‌ కుట్టి న్యాయవాదులకు తెలియజేశారు. ఈ విషయాన్ని కక్షిదారులకు దారులకు అందరికి కూడా తెలియజేయాలని ఆయన కోరారు.

➡️