అధికారం వచ్చాక అందరికీ న్యాయం

అధికారం వచ్చాక

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగంపిఠాపురం టిడిపి అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక తరగతులకూ న్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. శనివారం యువగళం పాదయాత్ర కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి మొదలై పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన వారు, ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్స్‌, మెకానిక్స్‌ తదితరులు తమ సమస్యలపై లోకేష్‌కు వినతిపత్రాలు అందించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయం సెంటర్‌లో ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ అసోసేయేషన్‌ ప్రతినిధులు లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సిఎం వైఎస్‌.జగన్‌ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని లోకేష్‌ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి వద్ద బిసిలతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ 10 శాతం తగ్గించడంతో 16,500 మంది బిసిలు పదవులకు దూరమయ్యారన్నారు. రూ.75,760 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించి అన్యాయం చేశారన్నారు. అంబేద్కర్‌ సెంటర్‌లో ఎస్‌సిలు వినతిపత్రం అందించారు. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు. కాకినాడలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన ఎంఎల్‌సి అనంతబాబును జగన్‌ వెంటేసుకుని తిరుగుతున్నారన్నారు. పిఠాపురం పాతబస్టాండులో మోటారు మెకానిక్స్‌ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం, యు.కొత్తపల్లి మండలంలో ఉప్పాడ వరకు పాదయాత్ర సాగింది. కౌలు రైతుల సమస్యలపై వినతిరాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యలపై లోకేష్‌కు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో కోటీ 20 లక్షల మంది కౌలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలో ఖర్చులు అధికం కావడం వల్ల భూ యజమానులు భూమిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడుతున్నారన్నారు. కూలి, నాలి చేసుకునే ఎస్‌సి, బిసి, ఒలు కౌలు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. అటువంటి కౌలు రైతులకు రెక్కల కష్టం మిగలడం లేదని అన్నారు. ఈ కాలంలో పెరిగిన ధరలు, గిట్టుబాటు ధర లేకపోవడం కౌలు రైతులకు అప్పులే మిగులుతున్నాయన్నారు. పామాయిల్‌ రైతుల వినతిసామర్లకోట రూరల్‌లో నారా లోకేష్‌కు తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి ఆధ్వర్యంలో 75 కిలోల ధాన్యంతో భారీ గజమాలతో స్వాగతం పలికారు. రైతుల సమస్యలపై వివరించారు. పామాయిల్‌ రైతుల అసోసియేషన్‌ అధ్యక్షుడు పెండ్యాల బుజ్జి ఆధ్వర్యంలో తమ సమస్యలపై లోకేష్‌కు వినతిపత్రం అందించారు. పవర, పండ్రవాడలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మహిళలు లోకేష్‌కు హారతులు పట్టారు. నిమ్మకాయల రంగనాగ్‌, పాలకుర్తి శ్రీనుబాబు, అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీనివాసు, రాజా సూరిబాబు రాజు, గుణ్నం చంద్రమౌళి, జనసేన పెద్దాపురం ఇన్చార్జ్‌ తుమ్మల రామస్వామి, కంటే జగదీష్‌ మోహన్‌ పాల్గొన్నారు. యు.కొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గంలో నారా లోకేష్‌ బహిరంగ సభను రద్దు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా వచ్చిన అభిమానులకు సెల్ఫీలు తీసుకునే విధంగా అవకాశం కల్పించారు పిఠాపురం నుంచి నవకండ్రవాడ, కొండవరం, మీదగా ఎండపల్లి జంక్షన్‌కు లోకేష్‌ చేరుకుని అక్కడ బస చేయనున్నారు.

➡️