అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం

Dec 11,2023 23:18
పాదయాత్ర యువగళం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారానికి 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం తేటగుంట పంచా యతీలో ఈ మజిలీకి గుర్తుగా అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభి స్తామని లోకేశ్‌ హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరిం చారు. తేటగుంట విడిది కేంద్రం నుంచి 219 వ రోజు యువగళం పాద యాత్ర ప్రారంభమైంది. 3 వేల కిలోమీటర్లు పూర్తి అయినందున గుర్తుగా తుని యనమల గెస్ట్‌ హౌస్‌ వద్ద లోకేష్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, చిన్నల్లుడు భరత్‌, లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌, భార్య బ్రాహ్మణి పాల్గొన్నారు.తేటగుంట పద్మనాభ ఫంక్షన్‌ హాలు వద్ద ఆర్‌ఎంపి డాక్టర్లు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వైద్య, ఆరోగ్యరంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. తాము ప్రత్యేక మెడికల్‌ బోర్డు ఏర్పాటుచేసి ఆర్‌ఎంపిలను కమ్యూనిటీ మెడిక్స్‌గా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చామ వరం గేటు వద్ద కోటనందూరు మండల ప్రజలు ఆయన్ని కలిశారు. సమస్యలను విన్నవించారు. లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌ పాలనలో ఇరిగేషన్‌ రంగం పూర్తిగా నిర్వీర్యమైం దన్నారు. కొత్తప్రాజెక్టుల మాట ఎలా ఉన్నా ఉన్న ప్రాజెక్టులకు గ్రీజు కూడా పెట్టని పరిస్థితి దాపురించిందన్నారు. టిడిపి అధికారంలోకొచ్చాక తాండవ రిజర్వాయర్‌కు మరమ్మతులు నిర్వహించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పలువురు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎస్‌.అన్న వరం సాయి వేదిక వద్ద కాపు సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి సమా వేశంలో లోకేశ్‌ మాట్లాడారు. జగన్‌ కాపులను నమ్మించి ద్రోహం చేశారన్నారు. కాపు కార్పొ రేషన్‌కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. మంత్రి రాజా అక్రమాలు మితిమీరాయని, అక్రమాలు, అవి నీతిపై విచారణ జరిపి వడ్డీతో సహా మంత్రితో కట్టిస్తామని తెలిపారు. అధికారంలోకొచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ రంగ కార్మికులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ అవినీతిదాహం కారణంగా నిర్మాణరంగం కుప్ప కూలిందన్నారు. బినామీ కంపెనీలతో ఇసుకను దోచేసి పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడంతో రాష్ట్రంలోని 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి సుమారు రూ.3వేల కోట్లు దారి మళ్లించి అన్యాయం చేశారన్నారు. పాదయాత్ర మధ్యలో దళిత నాయకులతో మాట్లాడుతూ వైసిపి హయాంలో దళిత మహిళలపై అత్యా చారాల్లో ఎపి మొదటి స్థానంలో ఉంద న్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులు దారిమళ్లించి దళితవాడల్లో అభివృద్ధికి మంగళం పాడారని విమర్శించారు. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌సి బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తామని, ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో ముగిసిన యువగళం పాదయాత్రయువగళం పాదయాత్ర సోమవారం సాయం త్రానికి జిల్లాలో పూర్తయింది. తాండవ బ్రిడ్జి మీదుగా విశాఖ జిల్లా పాయకరావుపేటలోకి ప్రవేశిం చింది. అక్కడ లోకేశ్‌కు అనకాపల్లి జిల్లా టీడీపీ నాయ కులు ఘనంగా స్వాగతం పలికారు. పాయకరావుపేట ఇన్‌ఛార్జి వంగలపూడి అనిత నేతత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ నాయకులు కెఎస్‌ జవహర్‌, నిమ్మకాయల చినరాజప్ప, సానా సతీష్‌ బాబు, హరీష్‌ మాధుర్‌, జ్యోతుల నవీన్‌, జ్యోతుల నెహ్రూ, కొండబాబు, యనమల దివ్య, ఆదిరెడ్డి వాసు, బొడ్డు వెంకటరమణ, అయితాబత్తుల ఆనందరావు తదితరులు వీడ్కోలు పలికారు.

➡️