అన్ని వయస్సుల వారిలోనూ మానసిక సమస్యలు

Feb 12,2024 00:31

మాట్లాడుతున్న డాక్టర్‌ ఎన్‌.ఉమాజ్యోతి
ప్రజాశక్తి – గుంటూరు :
నేటి సమాజ పరిస్థితులు అన్ని వయసుల వారిలో మానసిక సమస్యలు, రుగ్మతలకు కారణమవుతున్నాయని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) మానసిక వైద్య విభాగం అధిపతి డాక్టర్‌ ఎన్‌.ఉమాజ్యోతి అన్నారు. ఆదివారం బ్రాడీపేట 2/1లోని ఎస్‌హెచ్‌ఓ సమావేశ మందిరంలో ఎస్‌హెచ్‌ఓ హైపర్‌ టెన్షన్‌ అండ్‌ డయాబెటిక్‌ క్లబ్‌, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భ:గా నిర్వహించిన సభకు సభకు సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ టి.సేవకుమార్‌ వహించారు. డాక్టర్‌ ఎన్‌.ఉమాజ్యోతి మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతున్నాయి అన్నారు. విద్యా విధానం మొదలుకొని జీవన విధానం వరకు అన్ని అందుకు కారణమని చెప్పారు. యువతలో, మేధావులలో స్క్రిజోఫినియా, మానియా వంటి దీర్ఘకాల మానసిక వ్యాధులు, స్త్రీలలో ఓసిడి, హిస్టీరియా వంటి సమస్యలు, మధ్య వయసులలో, వృద్ధులలో మతిమరుపు, డైమెన్షియా ,అల్జీమర్స్‌ వంటి సమస్యలు ఎక్కువగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. తొలి దశలోనే మానసిక రుగ్మతలను, సమస్యలను గుర్తింస్తే మందుల అవసరం లేకుండా జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్‌ ద్వారా నియంత్రించవచ్చని చెప్పారు. అన్ని రకాల మానసిక వ్యాధులకు చికిత్స లున్నాయని, సమస్యల్ని వైద్యులతో చెప్పాడానికి ముందుకు రావాలని చెప్పారు. డాక్టర్‌ టి.సేవకుమార్‌ మాట్లా డుతూ అధిక బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ బాధితుల్లో డిప్రెషన్‌ గురికావడం సహజమని, వారికి వైద్యుని కౌన్సిలింగ్‌ అవసరమవుతుందని అన్నా రు. వ్యాధుల గురించి ఆలోచిస్తూ డిప్రెషన్‌కు గురికావడం మంచిది కాదన్నారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ టి.ధనుంజయరెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్‌ పావులూరి రమేష్‌ మాట్లాడారు. సంస్థ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, సభ్యులు సిహెచ్‌ .శివాజీ, కె.సత్యనారాయణ, జి.లింగారెడ్డి పాల్గొన్నారు.

➡️