అప్పుల్లో జమవుతున్న విద్యాదీవెన నిధులు

Mar 2,2024 21:46
ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి
అప్పుల్లో జమవుతున్న విద్యాదీవెన నిధులు
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన నుంచి వచ్చే నిధులు తల్లి అకౌంట్‌లలో వేయవద్దని, అవి తల్లి అకౌంట్‌లో పడటం వల్ల బ్యాంక్‌ల వారు తల్లిదండ్రులు అప్పులు ఉన్నారని జమ చేసుకుంటున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి తెలిపారు. శనివారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్‌డిఒ శీనానాయక్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ సర్వీస్‌ ఛార్జీల కింద బ్యాంక్‌ల్లో డబ్బులు జమ చేసుకుంటున్నారని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ వారు ఎస్‌సి ఎస్‌టి విద్యార్థులకు హాల్‌ టిక్కెట్‌లు ఇవ్వడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం మొత్తం కలిపి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. దాంతో దళిత గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు, బిటెక్‌, ఎంటిక్‌, బిఫార్మసీ విద్యార్థులు డబ్బులు పడకపోవడం వల్ల మళ్లీ అప్పులు చేసి యాజమాన్యానికి డబ్బులు కట్టాల్సి వస్తుందన్నారు. తల్లి అకౌంట్‌లలో వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా ఎస్‌సి ఎస్‌టి విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లు అందరికి కలిపి వేయడం వల్ల ఎస్‌సి ఎస్‌టిలకు నష్టం జరుగుతుందన్నారు. అనేక వసతి గృహాలలో కూడా భోజనం సరిగా పెట్టడం లేదన్నారు. కూలి చేసుకొనే వారు వారి పిల్లలను చదివించుకోవడం కష్టంగా ఉందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు విడిగా వేయాలని తెలియజేశారు. వసతిదీవెన, విద్యాదీవెనలలో కలపవద్దని తెలిపారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, జెడ్డా వాసు, ఆలూరి బ్రహ్మయ్య, రమేష్‌, చౌటూరి రవి, ఇంకా అనేకమంది పాల్గొన్నారు.

➡️