అభివద్ధికి సహకరించాలి : ఎంపిపి

ప్రజాశక్తి- చెన్నూరు మండలంలో జరుగుతున్న అభివద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించాలని మండల పరిషత్‌ అధ్యక్షులు చీర్ల సురేష్‌ యాదవ్‌ అన్నారు . మండల పరిషత్‌ సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశాల్లో తీర్మానించిన పనులు త్వరితగతిన జరగడంలేదని అధికారులు ప్రజా ప్రతినిధులు , ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. కడప కర్నూల్‌ హైవేలో గతంలో ఇళ్ల స్థలాలు పోయిన బాధితులకు ఇంతవరకు స్థలాలు కేటాయించలేదని పేర్కొన్నారు. రామాలయం వీధి వెనుక నూతన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, రెండో వార్డ్‌ నందు ఫోన్లో కనెక్షన్‌ ఇవ్వలేదని అని సభ దష్టికి తెచ్చారు. సి.బుడ్డాయిపల్లి, కొండపేట గ్రామాల్లో నిలిచిపోయిన అంగన్వాడీ భవనాలను పూర్తిచేయాలని పేర్కొన్నారు. హౌసింగ్‌ ఎఇ మిలన్‌ మాట్లాడుతూ మార్చి చివరికి కాలనీలో ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. విద్యుత్‌ అసిస్టెంట్‌ ఎఇ మాట్లాడుతూ రామాలయం పక్క వీధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు చాలా సమస్య ఉందని దాని తొందరగా పరిష్కరించి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎ.బి.ఎన్‌ గంగాధర్‌ మాట్లాడుతూ ఈనెల 16న వైఎస్‌ఆర్‌ చేయూత రూ. 18750.00 ఎస్‌సి, ఎస్‌సి, బిసి, మైనార్టీలకు నాల్గో విడత 1762 మందికి మంజూరయ్యాయని చెప్పారు. శిశు సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ మండలంలో 55 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 41 సొంత భవనాల్లో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కొండపేటలో హెల్త్‌ సెంటర్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్‌ తుంగ చంద్ర యాదవ్‌, ఎంపిటిసి నాగిరెడ్డి సభ దష్టికి తెచ్చారు. డాక్టర్‌ చెన్నారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి 25 లక్షలు పెంచారని సభ దష్టికి తెలిపారు. మండల పరిషత్‌ అధ్యక్షులు మాట్లా డుతూ మండలంలో రెండు పిహెచ్‌సిలు ఉండాల్సి ఉండగా ఒకటి మాత్రం చెన్నూరులో ఉందని అని మరొకటి కొండపేట గ్రామంలో ఏర్పాటు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు చిన్న( ఆర్‌ ఎస్‌ ఆర్‌) సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్‌ అల్లి శ్రీరామ్‌ మూర్తి, అడవి శాఖ డైరెక్టర్‌ రమణ శ్రీలక్ష్మి, సర్పంచులు తుంగ చంద్ర యాదవ్‌, ఉమ్మడి సుదర్శన్‌ రెడ్డి, ఎంపిటిసినాగిరెడ్డి ,నిరంజన్‌ రెడ్డి, ఎంపిడిఒ సుబ్రహ్మణ్యం శర్మ. డిటి వెంకట రమణ, ఎంఇఒ గంగిరెడ్డి. సునీత, గంగాధర్‌, ఎపిఒ శైలజ, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఎఒ శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు

➡️