అభివృద్ధిని చూసి వేసిపిలో చేరికలు

Feb 23,2024 21:33
ఫొటో : పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

ఫొటో : పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి
అభివృద్ధిని చూసి వేసిపిలో చేరికలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు వైసిపిలో చేరుతున్నారని, అలా చేరిన వారికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో సంగం మండలం వెంగారెడ్డిపాళెంకు చెందిన పలువురు నాయకులు వైసిపి నాయకులు గుండాల బాలచంద్రారెడ్డి, సిద్ధం నారయ్యల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన మళ్లీ కొనసాగేలా శ్రమించాలని సూచించారు.

➡️