అభివృద్ధిపై దృష్టి సారించాలి

Jan 27,2024 21:37
ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి మూలే పద్మజావినరురెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి మూలే పద్మజావినరురెడ్డి
అభివృద్ధిపై దృష్టి సారించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి మండల అధికారులు విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అందుబాటులో ఉండాలని ఎంపిపి మూలే పద్మజా వినరు రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఎంపిపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిడిఒ ఈశ్వరమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందన్నారు. బండగానపల్లి ఘాట్‌ రోడ్‌ నిర్మాణం హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరత ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపిటిసి కాకు విజయ త్వరగా తక్షణమే సంబంధిత అధికారులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధికి ప్రతి అధికారి సహరించాలన్నారు. ప్రస్తుతం రోడ్లు, డ్రెయినేజీలపై ప్రత్యేక దృష్టి సారించిందని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. రానున్న వేసవి దృష్ట్యా తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్‌ ఎఇకి సూచించారు. సమావేశంలో పలువురు సర్పంచులు ఎంపిటిసిలు తమ గ్రామ సమస్యలను ఎంపిపి దృష్టికి తీసుకెళ్లారు. మండల అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వివరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఈశ్వరమ్మ, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ అక్కి భాస్కర్‌ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు మూలే వినరు రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌ ఫాజిహా, ఎస్‌ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి, ఎపిఒ శ్రీనివాసులు, ఎపిఎం ఖాజా రహమతుల్లా, ఎంపిటిసిలు గొల్లపల్లి తిరుపతయ్య, సుభహాన్‌, కోఆప్షన్‌ సభ్యులు సుభాని, సర్పంచులు గౌస్‌ మొహిద్దీన్‌, తిరుపతి మాజీ సర్పంచులు సుబ్బారెడ్డి, అక్కుల్‌ రెడ్డి, ఎఒ సిహెచ్‌ రేణుక, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️