అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Dec 18,2023 19:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   నగరంలో వివిధ డివిజన్లలో రూ.80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయయర్‌ వి.విజయలక్ష్మి సోమవారం శంకుస్థాపన చేశారు. 13, 33, 42, 43, 45, 46 డివిజన్లో వివిధ ప్రాంతాలలో కాలువలు, రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన రహదారులను ప్రారంభించారు. డిప్యూటీ మేయర్‌ ముచ్చులయా యాదవ్‌, జోనల్‌ ఇంచార్జ్‌ మారం బాల బ్రహ్మారెడ్డి, 33 వ డివిజన్‌ కార్పొరేటర్‌ జివి రంగారావు ముద్దాడ మధు, గదుల సత్యలత, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఇసరపు రేవతి దేవి, పిన్నింటి కళావతి, దాసరి సత్యవతి, తాళ్లపూడి సంతోష్‌ కుమారి, బొద్దూరు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️