‘అమరజీవి’ త్యాగం మరువలేనిది :జెసి

ప్రజాశక్తి-రాయచోటి ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని జెసి ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు.శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి 1952 డిసెంబరు 15న అమరుల య్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరుడైన మహాప ురుషుడని కొనియాడారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్‌ 1 న ఏర్పడిందన్నారు. అనంతరం, తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలను కలిపి 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కషిచేసిన మహనీయుడన్నారు. ఇటువంటి మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశ భక్తితో మెలగాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, బిసిసంక్షేమ శాఖ అధికారి సందప్ప, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.పీలేరు : అమరజీవి పొట్టి శ్రీరాములుకు యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి, ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మ శాంతిని కోరుకుంటూ జోహార్లు పలికారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్‌రెడ్డి, పద్మావతి యుటిఎఫ్‌ పీలేరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌, వేణుగోపాల్‌, జిల్లా నాయకులు శివారెడ్డి, అక్రమ్‌బాషా, సుబ్రమణ్యం, విశ్వనాథ రెడ్డి, కూన సత్యనారాయణ, వేణుగోపాల్‌, బాలాజీ, రాజేష్‌ బాల, అంజి, హరి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️