అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

Dec 15,2023 22:55 #అమరజీవి
అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

ప్రజాశక్తి-తాళ్లపూడి, ఉండ్రాజవరంఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాల హెచ్‌ఎం దున్నా దుర్గారావు అన్నారు. శ్రీరాములు వర్థంతి సందర్భంగా శుక్రవారం పాఠశాల ఆవరణలో శ్రీరాములు చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉండ్రాజవరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి మాట్లాడారు. ఎంపిడిఒ జివిఎస్‌ఆర్‌కె.రాజు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో పాలాటి శరత్‌, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

➡️