అమ్మ భాషతోనే జాతి మనుగడ : ‘గానుగపెంట’

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పరభాషా మోజులో పాల కులూ, ప్రజలు మాతభాషలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుగు భాషా వికాస సమితి జిల్లా అధ్యక్షులు విద్వాన్‌ డాక్టర్‌ గాను గపెంట హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అంతర్జాతీయ మాత భాషా దినోత్సవ సందర్భంగా ఆకవైత్రి మల్ల సాహితీ పీఠం ఆధ్వర్యంలో నగరంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాల యంలో తెలుగు తల్లికి జోహార్లు తెలుగు భాషకు జేజేలు అనే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కార్యక్రమంలో తెలుగు భాషా భిమానులు సుబ్బరాయుడు, శ్రీరామమూర్తి, రాయుడు, హుస్సేన్‌, అబ్దుల్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అధికార భాషా సంఘం సభ్యులకి సత్కారం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్యను రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైవీయూ పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ పేరుకే పదవి అన్న చందంగా ఉండిపోకుండా వెంకటయ్య తన పరిధిలో తెలుగు భాష అమలు రక్షణ కోసం విశే షంగా కషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్ధనరాజు, సంస్థ సభ్యులు డేవిడ్‌, బాబు, సతీష్‌, మధు బాబు పాల్గొన్నారు. వెంకటయ్యను ఇతర అతిథులతో కలిసి ఘనంగా సత్కరించారు. కెఎల్‌ఎం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో… ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో మాతృ భాషా దినోత్సవం నిర్వహించారు. కార్య క్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.వి.రత్నమ్మ, సమన్వయ కర్తగా డి.ప్రభావతి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వి.ఆర్‌.జాన్‌ దేవానంద్‌ పాల్గొన్నారు. చెన్నూరు : మండలంలోని చిన్నమాచుపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిం చారు. కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కవి డాక్టర్‌ చిన్నావుల వెంకట రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు వై.అరుణ కుమారి, పాఠశాల తెలుగు భాషో పాధ్యాయులు పి.పార్థసారధి మాట్లాడారు. విద్యార్థుల పోటీలు నిర్వహించి, బహు మతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️