అరాచకాలు ఎక్కువైనందుననే మళ్లీ రాజకీయాల్లోకి..

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) వైసిపి పాలనలో నియోజకవర్గంలో అరాచకాలు ఎక్కువయ్యాయని, అందుకనే తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి టికెట్‌ తనకే వస్తుందని తాను ఏనాడు చెప్పలేదన్నారు. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వైసిపి నాయకులకు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము పేదలకు రెండు సెంట్లు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు. నేడు వైసిపి ప్రభుత్వంలో ఒక సెంటు స్థలా నికే పరిమితం చేసి పేదల కడుపు కొట్టారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ప్రొద్దుటూరు శాంతియుతంగా ఉండేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తనని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

➡️