అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు

Feb 23,2024 21:44
ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-జలదంకి : కుల మతాలకు పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని ఉదయగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జలదంకిలోని పద్మావతి కళ్యాణ మండపంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి చేతుల మీదగా ప్రశంసా పత్రాలు, మెడల్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అయితే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సారథులు వలంటీర్లు అని అన్నారు. ప్రజలకు వలంటీర్లు చేస్తున్న సేవలను కొనియాడారు. మళ్లీ ముఖ్యమంత్రి జగనన్న అయితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఈ విషయాన్ని వలంటీర్లు దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలను తెలియజేసి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి మండల కన్వీనర్‌ పాలవల్లి మాలకొండా రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి అని అందుకు నిదర్శనమన్నారు. పోరాడి జలదంకి మండల రైతాంగానికి సోమశిల జలాలు కేటాయించడమే అని తెలిపారు. అలాంటి నాయకుడిని ఉదయగిరి ఎంఎల్‌ఎగా గెలిపించేందుకు వలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికలలో జలదంకి మండలం నుంచి పదివేల మెజారిటీ ఒక్క జలదంకి మండలం నుంచే వస్తుందని, ఎంఎల్‌ఎగా రాజన్న గెలుస్తారని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగనన్నేనని ఆశాభావం వ్యక్తం చేశారు. వలంటీర్లు కరోనా సమయంలో కూడా చాలా కష్టపడి పని చేశారన్నారు. కాబట్టి గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను ప్రతి వలంటీర్లకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉదయగిరి వైసిపి యువ నాయకులు మేకపాటి అభినవ్‌రెడ్డి, ఎంపిడిఒ కె.రాజశేఖర్‌ రావు, ఇఒపిఆర్‌డి అజిత, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, ఎస్‌సిసెల్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ దామెర్ల దేవదాసు, జిల్లా వ్యవసాయ జనరల్‌ సెక్రెటరీ రావి ప్రసాద్‌ నాయుడు, వైసిపి జిల్లా పబ్లిసిటీ వింగ్‌ జనరల్‌ సెక్రెటరీ అంకినపల్లి నరసింహారెడ్డి, సర్పంచులు గండు వెంకారెడ్డి, తమ్మినేని సతీష్‌ బాబు, బోడి మల్ల కృష్ణారెడ్డి, గోపాల్‌ రెడ్డి, నాయకులు గుమ్మడి రమేష్‌, వల్లంరెడ్డి నర్సారెడ్డి, బాబుల్‌ రెడ్డి, కాకాని మహదేవయ్య గుమ్మలంపాటి సుబ్బారావు, గుమ్మలంపాటి కళ్యాణ్‌, సురేష్‌, శేషారెడ్డి, హరిబాబు రెడ్డి, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు మండలంలోని వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️