అలరించిన చిన్నారుల ఆటల పోటీలు

అలరించిన చిన్నారుల ఆటల పోటీలు

ప్రజాశక్తి – తాళ్లరేవులెమన్‌ అండ్‌ స్పూన్‌, గన్ని బ్యాగ్‌ రేస్‌, పరుగు పందాలు వంటి పోటీల్లో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. మహిళలు మ్యూజికల్‌ చైర్స్‌ ఆడి ఆనందించారు. కార్తీక మాస వనభోజనాల్లో భాగంగా జార్జిపేట శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోపాల్‌ గార్డెన్స్‌లో వన సమారాధన ఘనంగా నిర్వహించారు. తొలుత మహాత్మా జ్యోతీరావు పూలే, దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, శెట్టిబలిజ నాయకులు పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి, టేకుమూడి అనంతలక్ష్మి లక్ష్మణరావు, రెడ్డి సతీష్‌, గుత్తుల సూర్యనారాయణ, పెంకే ఏడుకొండలు, పిల్లి సత్తిబాబు హాజరై మాట్లాడారు. యువకులంతా సంఘటితంగా సమాజ హితం కోరే పనులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుత్తుల ఈశ్వరరావు, సతీష్‌ కుమార్‌, కొప్పిశెట్టి భద్రం, గెద్దాడ శ్రీనివాసరావు, రాయుడు గోవిందు, చిట్టూరి మహేష్‌ , దంగేటి సూరిబాబు, నీలాద్రి పాల్గొన్నారు.

➡️